ఫ లక్ష దీప కాంతులు
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో ఆలయ ప్రాంగణం, పుష్కరిణి కొత్త శోభను సంతరించుకున్నాయి.
స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. స్వామివారికి అర్చకులు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
– రాజమహేంద్రవరం రూరల్


