నేడు పీజీఆర్‌ఎస్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు లోను కాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి, తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని సూచించారు. అలాగే, 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. గతంలో సమర్పించిన అర్జీల పరిష్కార స్థితిని 1100 నంబర్‌కు ఫోను చేయడం ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. వీటితో పాటు 95523 00009 వాట్సాప్ గవర్నెన్స్ సేవను కూడా వినియోగించుకోవచ్చని కలెక్టర్ సూచించారు.


