రూ.3 లక్షల నష్టం వస్తుంది
కౌలుకు 9 ఎకరాలు చేస్తున్నాను. ఎకరాకు రూ.35 వేల వరకూ పెట్టుబడి పెట్టాను. పంట బాగా పండింది. కష్టాలు గట్టెక్కాయని ఆనందిస్తున్న సమయంలో తుపాను గాలుల కారణంగా చేను పూర్తిగా నేల వాలిపోయింది. ఎకరాకు మరొక్క రూ.8 వేల పెట్టుబడి పెడితే పంట ఇంటికి వచ్చేది. పడిపోయిన చేనును ఒబ్బిడి చేయడానికే ఎకరాకు కనీసం రూ.30 వేలు ఖర్చవుతుంది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో పంట చేతికి రాదు. సుమారు రూ.3 లక్షల నష్టం వస్తుంది.
– బండారు రాము, కౌలు రైతు, కొప్పవరం, అనపర్తి మండలం
చేతికొచ్చిన పంట నేలపాలు
కౌలుకు 9 ఎకరాలు తీసుకుని స్వర్ణ రకం వరి సాగు చేశాను. తుపాను ప్రభావంతో పంట మొత్తం పడిపోయింది. ఎకరానికి కౌలు రూ.25 వేలు చెలించాను. సాగు ఖర్చులు మరో రూ.25 వేలు అయ్యాయి. చేను కోతకు వచ్చింది. మామూలుగా అయితే కోతకు ఎకరానికి రూ.3 వేల ఖర్చయ్యేది. పూర్తిగా పడిపోయి నీరు ఉండటంతో ఎకరం కోతకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ అవుతోంది. ఎకరానికి 5 బస్తాల ధాన్యం రాలిపోయింది. ఎకరానికి రూ.20 వేల వరకూ నష్టం వస్తోంది.
– పోతిరెడ్డి నాగరాజు, వేగేశ్వరపురం, తాళ్లపూడి మండలం
రూ.3 లక్షల నష్టం వస్తుంది


