పూర్తిగా నష్టపోయా..
ఎకరం లంక భూమికి రూ.45 వేల శిస్తు చెల్లించి, దోస సాగు చేశా. దోస కాయలు కాస్తూండగా వచ్చిన మోంథా తుపాను కారణంగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు పాదుల్లో నీరు పట్టింది. ఈదురు గాలులకు నేలపై పాకిన పాదులు మెలిపడి, కుదుళ్లు కదిలి పాడైపోయాయి. పాదులు ఎర్రబారి, కాయలు కుళ్లిపోయాయి. ఇప్పటి వరకూ రూ.75 వేల పెట్టుబడి పెట్టాను. పూర్తి స్థాయిలో నష్టం మిగిలింది.
– గట్టి ఆదయ్య, లంకూరు సీతానగరం మండలం
నష్టపరిహారం ఇవ్వాలి
కౌలుకు 30 ఎకరాలు తీసుకుని స్వర్ణ రకం వరి వేశాను. తుపాను ధాటికి చూస్తూండగానే మొత్తం పంట పడిపోయింది. పంట మొత్తం తయారయ్యాక భారీ వర్షం, గాలులకు ధాన్యం రాలిపోయింది. కోత కోయాలంటే అదనంగా రూ.10 వేల వరకూ ఖర్చవుతుంది. కౌలు రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇవ్వాలి.
– శూలా పోశియ్య, కౌలు రైతు,
వేగేశ్వరపురం, తాళ్లపూడి మండలం
పూర్తిగా నష్టపోయా..


