మొలకలు వచ్చినా పట్టించుకున్నవారే లేరు
నోటి కాడికి వచ్చిన పంట నిలువునా గంగమ్మ పాలైంది. 9 ఎకరాలలో దేశవాళీ రకం క్యూజీ పటాలీ (వరి రకం) సేంద్రియ సాగు చేశాను. చేను బాగా పెరిగింది. దీపావళి తర్వాత 7 ఎకరాలు కోత కోశాను. ఆ వెంటనే వర్షాలు ప్రారంభమయ్యాయి. ధాన్యం బయటకు వచ్చే మార్గం లేక చేలోనే భద్రపరిచాను. ఈలోగా తుపాను చుట్టిముట్టి, ధాన్యం మొత్తం తడిసిపోయింది. మరో రెండెకరాలు కోయడానికి వీలు లేకుండా నేలనంటేసింది. ఎకరానికి రూ.25 వేల వరకూ పెట్టుబడి పెట్టాను. తుపాను పోయి నాలుగు రోజులైనా ఇంతవరకూ రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు నా పొలాన్ని కనీసం పరిశీలించలేదు. పొలంలో నీళ్లుండటంతో అధికారులు రావడం లేదేమోనని మొలకలు వచ్చిన ధాన్యాన్ని శుక్రవారం ట్రాక్టర్‌పై ఇంటికి తీసుకు వచ్చాను. నాకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి, నష్టపరిహారం అందించాలి. – తాతిన కాశీవిశ్వేశ్వరావు, రైతు,
ప్రకాశరావుపాలెం, నల్లజర్ల మండలం


