
మళ్లీ పోటెత్తిన ఎర్ర కాలువ
నిడదవోలు రూరల్: భారీ వర్షాలకు ఎర్ర కాలువ మరోసారి పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో నిడదవోలు మండలం కంసాలిపాలెం – మాధవరం వంతెన వద్ద మంగళవారం ఉదయం నుంచీ ప్రవాహ ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. వంతెనపై ప్రమాదకర స్థితిలో ఎర్రకాలువ నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నిడదవోలు రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనుల దృష్ట్యా అధికారులు నిడదవోలు నుంచి తాడేపల్లిగూడేనికి సింగవరం మీదుగా తాళ్లపాలెం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నుంచి కార్లు, బైక్‌లను మళ్లించారు. అయితే, ఎర్ర కాలువ సమీపంలో ఉండటంతో ఈ బ్రిడ్జి వద్దకు కూడా నీరు చేరింది. తప్పని పరిస్థితుల్లో వాహనదారులు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.

మళ్లీ పోటెత్తిన ఎర్ర కాలువ