
నకిలీ మద్యంపై నేడు వైఎస్సార్ సీపీ ధర్నా
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వాతావరణ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత బీసీ సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖలు, లేపాక్షి ఎంపోరియం అధికారులతో ఆమె నగరంలో ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో బీసీ హాస్టళ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలని, దోమలు రాకుండా మెష్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
కాచి చల్లార్చిన నీరు, తాజాగా వండిన ఆహారం మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. విశ్రాంతి, తరగతి గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి ఆహారం తీసుకురానీయవద్దని స్పష్టం చేశారు. ప్రతి వసతి గృహం, గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆప్కో, లేపాక్షి విక్రయాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, ఏపీ బీసీ కో ఆపరేటివ్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్‌డీఓ ఆర్.కృష్ణనాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, ఆప్కో జీఎం కె.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.