
అన్నీ భరించేది అన్నదాతలే..
సాగులో ఎదురయ్యే కష్టనష్టాలతో పాటు మార్కెట్‌లో ఏర్పడే ఒడుదొడుకులన్నింటినీ భరించేది అన్నదాతలే. ప్రకృతి కరుణించి, చీడపీడల బెడద లేకపోతే మంచి దిగుబడులు వస్తాయి. లేకుంటే ఆశించిన దిగుబడులు రావు. అన్నీ అనుకూలిస్తేనే ఎంతో కొంత మిగులు ఉంటుంది. ఒకవేళ నష్టం వచ్చినా రైతు వ్యవసాయాన్ని వదల్లేడు. తరువాత పంటలోనైనా మేలు జరుగుతుందనే ఆశతో మరోసారి అడుగు వేస్తాడు.
– ప్రగడ వీర వెంకట్రావు,
రైతు, నరేంద్రపురం
ధాన్యం కొనుగోలు చేయాలి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిరంతరం అన్నదాతల మేలు కోసమే ఆలోచించి, ఆచరణీయమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లేది. రైతులు ఆ విషయాన్ని నేడు గ్రహిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో, మిల్లర్లు చెప్పిన ధరకే పంటను అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇదే సీజన్‌లో గత ప్రభుత్వం బస్తా ధాన్యానికి రూ.1,750 గిట్టుబాటు ధర ప్రకటించడంతో మిల్లర్లు రూ.1,800కు పైబడి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేక రైతులు నష్టపోతున్నారు. పాలకులు వెంటనే మేల్కొని, తక్షణమే ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి.
– అడబాల చినబాబు,
వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు

అన్నీ భరించేది అన్నదాతలే..