
14 నుంచి ‘నన్నయ’లో ఫుడ్ ఫెస్టివల్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే మెగా ఫుడ్ ఫెస్టివల్ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుందని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులతో సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఈ నెల 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని, గోదావరి రుచులను, అభిరుచులను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఆహార పదార్థాల తయారీలో చేయితిరిగిన ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయనిర్మల, హెచ్‌ఓడీ ఆచార్య డి.కల్యాణి, అధ్యాపకులు ఎంఎం కృష్ణవేణి, కె.సింధూజ పాల్గొన్నారు.