
జయజయహే మహిషాసుర మర్దిని
నాసి ఫెలోగా నిర్కా డైరెక్టర్ శేషుమాధవ్ ఎంపిక
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): అలహాబాద్‌లోని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (నాసి) ఫెలోగా రాజమహేంద్రవరం ఐసీఏఆర్ –జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిఽశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ ఎన్నికయ్యారు. నాసి సంస్థ 1930లో ప్రొఫెసర్ మేఘనాథ్ సాహా (వ్యవస్థాపక అధ్యక్షుడు) నేతృత్వంలోని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల బృందం స్థాపించిన పురాతన సైన్సు అకాడమీ. భారత ప్రభుత్వ సైనన్స్ – టెక్నాలజీ విభాగానికి చెందిన శాసీ్త్రయ వృత్తిపరమైన సంస్థ. ఇందులోలో నోబెల్ బహుమతి విజేతలు సహా విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు ఫెలోస్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యవసాయ రంగం నుంచి కొంతమంది మాత్రమే ఫెలోస్‌గా ఎంపికయ్యారు. వరిలో అగ్గి తెగులు నిరోధక జన్యువులను క్లోనింగ్ చేయడంలో, అగ్గి తెగులు వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో, వాణిజ్య పంటలపై తీసుకున్న నూతన ప్రణాళికలలో చేసిన కృషికి గాను వ్యవసాయ శాస్త్రంలో 2025 సంవత్సరానికి శేషుమాధవ్ నాసి ఫెలోగా ఎంపికయ్యారు. ఈ ఎన్నిక రాజమహేంద్రవరంలోని ఐ.సి.ఎ.ఆర్.– నిర్కా సంస్థకు ఎంతో గౌరవప్రదమైన గుర్తింపుగా భావించవచ్చు.
ఉప్పొంగి ఉరికింది గోదావరి!
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి ఉప్పొంగుతోంది. జీవనదికి అతి భారీ వరదలు సంభవించే ఆగస్టు మాసం సైతం దాటిపోయింది. ఇక వరద ముప్పు తప్పినట్లేనంటూ అధికారులు సైతం ఊపిరిపీల్చుకున్నారు. అయితే అనూహ్యంగా గతంలో ఎన్నడూ లేని ఘట్టం ఆవిష్కృతమైంది. సెప్టెంబర్ మాసంలో గోదావరి వరద ప్రవాహం పెరిగింది. గత ఏడేళ్లలో లేని విధంగా ఇన్‌ఫ్లో గత నెలలో నమోదైంది. ఇందుకు తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ తరహా వర్షాలు కురవడమే కారణమని సాగునీటి నిపుణులు వెల్లడిస్తున్నారు. గోదావరి సెప్టెంబర్ మాసంలో ఉధృతంగా ప్రవహించింది.
ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా..
గోదావరి పరీవాహక ప్రాంతాలు, తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురవడంతో గోదావరికి వరద ప్రవాహం పోటెత్తింది. ఫలితంగా సెప్టెంబర్ మాసంలో అత్యధిక ఇన్‌ఫ్లో నమోదైంది. ఆ ఒక్క నెలలో 1,587 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఏడేళ్లలో ఇంత భారీ స్థాయిలో ఇన్‌ఫ్లో నమోదవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఏడాది జూన్ మాసం నుంచి ఆగస్టు నాటికి 1,998.787 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదవగా.. ప్రస్తుతం 3,727 టీఎంసీల ఇన్‌ఫ్లో ఉంది. ఈ పరిణాం పంటల సాగుకు ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.
సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో వరద
గోదావరికి సాధారణంగా ఆగస్టు నెలలో వరద ప్రవాహం పెరుగుతుంది. ఈ సీజన్‌లో మూడుసార్లు వరదలు వచ్చాయి. గత నెల 21వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. 22న బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి ఉధృతి చేరింది. గత నెల 30 తేదీ నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. గత శనివారం మూడో సారి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరింది. వరద సీజన్ దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఈ ఏడాది తక్కువ ఇన్‌ఫ్లో నమోదవుతుందని భావించారు. కానీ సెప్టెంబర్‌లో నమోదైన ఇన్‌ఫ్లోతో ఇక ముందు ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొవాల్సిన పరిస్థితిని నుంచి బయటపడే సూచనలు దర్శనమిస్తున్నాయని సాగునీటి పారుదల నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
ఎగువ నుంచి భారీగా వస్తున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం ఉదయం 10 గంటల సమయానికి నీటి మట్టం 13.50 అడుగులకు చేరింది. 12,42,526 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 13,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ ప్రవాహం సాయంత్రానికి మరింతగా పెరిగింది. 13.60 అడుగులకు చేరింది. ఇది రాత్రికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. 12,59,482 క్యూసెక్కుల మిగులు జలాలు సముంద్రంలోకి విడుదల చేయగా.. 12,800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు.
పాడి గేదెలను వదలని వ్యాధి
తాళ్లపూడి: మండలంలోని పెద్దేవం గ్రామంలో అంతు చిక్కని వ్యాధితో పాడి గేదెలు మృతి చెందుతున్న పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయి. పశు సంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణ చేస్తూ వైద్యం అందజేస్తుండడంతో పాటు, కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన నేపథ్యంలో రైతుల్లో ఒకింత ధైర్యం వచ్చింది. గ్రామంలో మృతి చెందుతున్న చూడి గేదెలు, లేదా ఈనిన పాడి గేదెలు మాత్రమే వ్యాధి బారిన పడుతున్నట్టు గుర్తించి ఆ దిశగా వైద్య సేవలు అందించారు. అయినా ఫలితం లభించడం లేదు. గ్రామంలో 38 గేదెలు ఇప్పటి వరకు వ్యాధి భారిన పడ్డాయి. వైద్యం చేయించుకున్న గేదెలు కూడా రోగం బారిన పడటం సర్వసాధారణంగా మారింది. జిల్లా స్థాయి అధికారులు వచ్చి వెళ్లిన తరువాత మరో ఐదు గేదెలు ప్రమాదం లో పడ్డాయి. తాజాగా రెండు గేదెలు వ్యాధి బారిన పడ్డాయి. దీంతో రైతు ఆందోళన చెందుతున్నారు.
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అమ్మవారి ఆలయాల్లో బుధవారం అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్ర మహోత్సవాలు ముగియనుండటంతో భక్తులు అమ్మవారి దర్శనాలకు పోటెత్తుతున్నారు. రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అలంకరించారు. విజయవాడకి బయలుదేరే భవానీలు దేవీచౌక్‌లోని అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు.
సెప్టెంబర్‌లో ఉధృతంగా
వరద ప్రవాహం
ఒక్క నెలలోనే 1,584
టీఎంసీల ఇన్‌ఫ్లో
గడిచిన ఏడేళ్లలో ఇదే తొలిసారి
జూన్ నుంచి ఆగస్టు నాటికి 1,998.787 టీఎంసీల ఇన్‌ఫ్లో
తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ తరహా
వర్షాల వల్లే అంటున్న నిపుణులు
సెప్టెంబర్ నెలలో ఇన్‌ఫ్లో...
సంవత్సరం ఇన్‌ఫ్లో (టీఎంసీలలో)
2019 1307.367
2020 865.640
2021 1055.275
2022 1218.214
2023 859.877
2024 1330.387
2025 1584.53
0000662982-000001-TALARI VENKATAR
15.00x8.00
TALARI VENKATARAO
సెప్టెంబర్‌లో వరద రావడం అరుదు
గోదావరికి సెప్టెంబర్ నెలలో రెండు సార్లు వరద రావడం చాలా అరుదు. ఏకంగా 1,584 టీఎంసీల ఇన్ ఫ్లో నమోదు కావడం మరింత అరుదు. గతంలో ఈ స్థాయిలో ఇన్ ఫ్లో వచ్చిన ఉదంతాలు ఉన్నప్పటికీ గత కొన్ని ఏళ్లలో ఇదే తొలిసారి. ఆగస్టు నెలాఖరు వరకు ఉన్న ఇన్ ఫ్లో చూసి గోదావరి డెల్టాలో రబీ పరిస్థితిపై భయం వేసింది. ఇప్పుడు ఇన్ ఫ్లో బాగుంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగనన్‌మోహనన్‌రెడ్డి హయాంలో పోలవరం స్పిల్ వేకు గేట్లు పెట్టడం వల్ల 16 టీఎంసీలకు పైగా నీటి నిల్వ చేసే సౌలభ్యం దక్కింది. దీనివల్ల వచ్చే రబీలో పెద్దగా నీటిఎద్దడి రాకపోవచ్చు.
– విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్‌ఈ, ధవళేశ్వరం ఇరిగేషనన్ సర్కిల్,
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్

జయజయహే మహిషాసుర మర్దిని

జయజయహే మహిషాసుర మర్దిని

జయజయహే మహిషాసుర మర్దిని

జయజయహే మహిషాసుర మర్దిని

జయజయహే మహిషాసుర మర్దిని

జయజయహే మహిషాసుర మర్దిని