
కుక్క కడుపులో రాళ్ల తొలగింపు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం కంబాలచెరువు ప్రాంతానికి చెందిన కోన పరసురామన్‌కు చెందిన నాలుగేళ్ల మినీ పమేరియన్ డాగ్‌కు స్థానిక ఏరియా పశు వైద్యశాలలో శస్త్ర చికిత్స చేసి కడుపులో ఉన్న వంద గ్రాముల బరువైన రాళ్లను తొలగించారు. పశు వైద్యశాల సహాయ సంచాలకుడు సత్యనారాయణ నేతృత్వంలో డాక్టర్లు యోగానంద్, రాజశేఖర్‌ల బృందం కుక్కకు స్కానింగ్ చేసి రాళ్లు ఉన్నట్లు గుర్తించి బుధవారం శస్త్రచికిత్స వాటిని తొలగించారు. నాలుగు కిలోల బరువు కల్గిన ఆ కుక్క కడుపులో 100 గ్రాముల బరువున్న రాళ్లను తీశారు. వంశపారంపర్యంగా, తక్కువ నీరు తాగడం, మాంసాహార అలవాట్లు వల్ల ఈ స్టోన్స్ వస్తుంటాయని సత్యనారాయణ తెలిపారు.

కుక్క కడుపులో రాళ్ల తొలగింపు