
ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం
● తరలివచ్చిన పార్టీ శ్రేణులు
● జక్కంపూడి స్వగృహంలో సర్వమత ప్రార్థనలు
సాక్షి, రాజమహేంద్రవరం: మద్యం అక్రమ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఎంపీ మిథున్‌రెడ్డికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు స్థానిక సెంట్రల్ జైల్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఏసీబీ కోర్టు వెలువరించిన బెయిల్ ఉత్తర్వులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా జైల్ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డిని చూసేందుకు భారీగా పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఇంటి వద్దకు భారీ కాన్వాయ్‌లో వెళ్లారు. అక్కడే కాసేపు పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన అనంతరం మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన, తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్ పయనమయ్యారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, మాజీ ఎంపీ ఎంపీ చింతా అనురాధ, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మేడపాటి షర్మిలారెడ్డి, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావ్, సత్తిసూర్యనారాయణ రెడ్డిలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం కన్వీనర్ జక్కంపూడి గణేష్ ఉన్నారు.
సర్వమత ప్రార్థనలు
రాజమహేంద్రవరం సిటీ: సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి శనివారం ప్రకాశం నగర్‌లోని జక్కంపూడి స్వగృహంలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గ్గిరెడ్డి, మాజీ ఎంపీ చింతా అనురాధ, డాక్టర్ జక్కంపూడి సుకీర్తి, డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం

ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం

ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం