పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన భక్తులు

Sep 7 2025 7:40 AM | Updated on Sep 7 2025 7:40 AM

పోటెత

పోటెత్తిన భక్తులు

పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో తెల్లవారుజామునుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కళగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. దాతల ఆర్థిక సాయంతో 6,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

పౌల్ట్రీ రైతులు జాగ్రత్తలు

పాటించాలి

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇటీవల వివిధ కారణాలతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని, ఈ నేపథ్యంలో జిల్లాలోని రైతులు, పెరటి కోళ్ల పెంపకందారులు, మార్కెట్‌లోని వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్‌ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పౌల్ట్రీల యజమానులు తమ కోళ్ల ఫారాల్లో బయో సెక్యూరిటీ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖ జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందితే, సమీపంలోని పశుసంవర్ధక శాఖ సిబ్బందికి తెలియజేయాలన్నారు. అలాగే జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయ కాల్‌ సెంటర్‌ 88340 58087ను సమాచారం ఇవ్వాలన్నారు.

కాటన్‌ బ్యారేజీకి తగ్గిన నీటి ఉధృతి

ధవళేశ్వరం: కాటన్‌ బ్యారేజీకి నీటి ఉధృతి తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గడంతో శనివారం రాత్రి బ్యారేజీ వద్ద పది అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.42 మీటర్లు, పేరూరులో 13.87 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.31 మీటర్లు, భద్రాచలంలో 36.80 అడుగులు, కూనవరంలో 16.48 మీటర్లు, కుంటలో 7.84 మీటర్లు, పోలవరంలో 11.33 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.47 మీటర్ల నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.

160 ఎంవీవీ

ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభం

రాజమహేంద్రవరం రూరల్‌: బొమ్మూరులోని ఏపీ ట్రాన్స్‌కో ఓ–ఎమ్‌ సర్కిల్‌ సబ్‌ స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. గత 50 ఏళ్లుగా సేవలందించిన 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో ఆధునిక 160 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దానికి శనివారం జోనల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ బి.శ్యాం ప్రసాద్‌ చార్జింగ్‌ చేసి, సేవలను ప్రారంభించారు. కాగా.. పాత ట్రాన్స్‌ఫార్మర్‌ను 1976 అక్టోబర్‌ 18న ప్రారంభించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పనిచేసిన దానికి గౌరవంగా వీడ్కోలు పలికారు. చివరిసారిగా 2015 మార్చి 21న ఓవర్‌ ఆయిలింగ్‌ చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ ప్రభు, డివిజనల్‌ ఇంజినీర్‌ కె.విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ పాత ట్రాన్స్‌ఫార్మర్‌ అందించిన సేవలు అద్భుతమైనవని కొనియాడారు. కేవలం 40 రోజుల్లోనే కొత్త 160 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడం ఘనతగా పేర్కొన్నారు.

తిరుచ్చి వాహనంపై

సత్యదేవుని సేవ

అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శనివారం ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవ మూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి అర్చకులు సుధీర్‌ తదితరులు పూజలు చేసి ఊరేగింపు ప్రారంభించారు.

పోటెత్తిన భక్తులు
1
1/2

పోటెత్తిన భక్తులు

పోటెత్తిన భక్తులు
2
2/2

పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement