
ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని ఏపీఎన్‌జీజీఓల అసోసియేషన్ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫెడరేషన్ కో ఆర్డినేటర్ దడాల జగ్గారావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జానీ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు పాల్గొన్నారు. జానీ పాషా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ మార్పు చేసి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సాధించడం కోసం నోషనల్ ఇంక్రిమెంట్లు సాధించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులు అంటే కట్టు బానిసలుగా భావిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉద్యోగులు ఎట్టి పరిస్థితిలో బానిసలు కాదన్నారు. సచివాలయాల శాఖ సర్వేల శాఖగా మారిపోయిందన్నారు. సమావేశానికి హాజరైన వివిధ విభాగాల సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర నాయకత్వం దృష్టికి అనేక సమస్యలను తీసుకొచ్చారు. రాజమహేంద్రవరం ఏపీఎన్‌జీజీఓ అసోసియేషన్ నగర అధ్యక్షుడు పి.అనిల్‌కుమార్, నగర కార్యదర్శి సేవా ప్రవీణ్, కొల్లిరాజేష్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయ
ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు