భర్త వేధింపులు తాళలేక టీచర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు తాళలేక టీచర్‌ ఆత్మహత్య

Oct 30 2023 11:50 PM | Updated on Oct 31 2023 8:29 AM

- - Sakshi

ఆత్రేయపురం: మండల పరిధిలోని ర్యాలి గ్రామంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆలమూరు ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన సుంకర నాగ వెంకటలక్ష్మి (36) ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ మేరకు ఆమె సోదరుడు సుంకర కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అక్క ఆలమూరు ప్రభుత్వ బాలికల పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోందని, భర్త రమేష్‌ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి భర్త ఫార్మా కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై బీవై కిరణ్‌కుమార్‌ పరిశీలించి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement