
మొగలికుదురులో కరెన్సీతో వినాయకునికి అలంకరణ
మామిడికుదురు: గణపతి నవరాత్ర వేడుకల్లో భాగంగా ఆదుర్రు శివారు మోరిపొలంలో విఘ్నేశ్వరునికి 190 రకాల వంటకాలు నివేదించారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 108 శివలింగాలకు అర్చన, జ్యోతిర్లింగార్చన ఘనంగా జరిగాయి. పలువురు భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. మొగలికుదురు జున్నూరి నగర్‌లో ఏర్పాటు చేసిన పృథ్వీ గణపతిని రూ.50 వేల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. 100, 50, 20 నోట్లతో గణపతి మంటపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.