సోమవారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

లో

ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో

భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ

కోటిపల్లిలోని రాజరాజేశ్వరీ సమేత ఛాయా సోమేశ్వరస్వామి

సీమలో శివోహం

సాక్షి, అమలాపురం/ నెట్‌వర్క్‌: గోదావరి నదీపాయల చెంత.. పచ్చని ప్రకృతి ఒడిలో పరమేశ్వరుని పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కుతున్నాయి. నదీ జలాల సవ్వడులు.. పచ్చని కొబ్బరి తోటల మధ్య కొలువుదీరిన శివాలయాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరుడు మొదలుకొని మురమళ్ల వీరేశ్వరుడు, పలివెల కొప్పేశ్వరుడు, కుండలేశ్వరుడు, ముక్తేశ్వరుడు, కోటిపల్లి ఛాయా సోమేశ్వరుడి వరకు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేందుకు ముస్తాబయ్యాయి. కార్తికమాసం తొలి సోమవారం కావడంతో ఆయా ఆలయాల వద్ద అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు, వ్రతాలు, వన సమారాధనలతో జిల్లా భక్తిపారవశ్యంలో మునిగిపోనుంది.

హిందూ సంప్రదాయంలో కార్తిక మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో నిత్య పూజలు, దీపారాధనలు చేయడం పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సోమవారాల్లో శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. నాగుల చవితి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి వంటి పర్వదినాలతో పాటు నాలుగు సోమవారాలు, ఏకాదశులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆలయాల్లో బారికేడ్లు, ప్రత్యేక క్యూ, విద్యుత్‌ అలంకరణలు ఏర్పాటు చేశారు.

ఊరూరా శివయ్య మంత్రం

ఫ రామచంద్రపురం మండలం ద్రాక్షారామలోని శ్రీమాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయం పంచారామాల్లో ఒకటి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. సప్త గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. రద్దీ నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఫ ఐ.పోలవరం మండలం మురమళ్లలో వృద్ధ గౌతమీ నదీపాయ చెంత వెలసిన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం నిత్య కల్యాణాలతో ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ స్వామివారికి కల్యాణం చేయిస్తే అవివాహితులకు వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. కార్తిక మాసంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఫ కొత్తపేట మండలం పలివెలలోని ఉమా కొప్పేశ్వరస్వామి ఆలయం పురాణ ప్రాశస్త్యం కలిగిన క్షేత్రం. అగస్త్య మహాముని తపస్సు ఫలితంగా శివపార్వతులు ఏకపీఠంపై వెలిశారని స్థల పురాణం చెబుతోంది. శివలింగం ముందు భాగంలో కొప్పు ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత.

ఫ కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో గౌతమీ నదీపాయ చెంత కొలువైన స్వామివారి శివలింగం కుండలం ఆకారంలో ఉంటుంది. వృద్ధ గౌతమిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే అనంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

ఫ అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వరస్వామి ఆలయం త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించినదిగా భక్తులు విశ్వసిస్తారు. స్వామివారిని దర్శిస్తే ముక్తి లభిస్తుందనే నమ్మకంతో భక్తులు తరలివస్తారు.

ఫ గౌతమీ గోదావరి తీరాన కోటిపల్లిలోని రాజరాజేశ్వరీ సమేత ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోటి కన్యాదానాలు, వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకునేందుకు కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఫ అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో ఉన్న ఏకాదశ రుద్రులు కొలువుదీరిన అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలోని శ్రీవ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి శ్రీమేనకేశ్వర స్వామి, ఇరుసుమండ శ్రీఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక – శ్రీవిశ్వేశ్వరస్వామి, నేదునూరు శ్రీచెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల – శ్రీరాఘవేశ్వరస్వామి, మోసలపల్లి శ్రీమధుమనంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి శ్రీచెన్నమల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం శ్రీవీరేశ్వరస్వామి, గంగలకుర్రు శ్రీచెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు శ్రీఅభినవ వ్యాఘ్రేశ్వర స్వామి ఆలయాలకు ఇటీవల ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

జిల్లాలో ఇవే కాకుండా రాజోలు మండలం కడలి కపోతేశ్వరస్వామి, ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుదీరిన అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి, ఇదే మండలంలో ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది.

8

ఫ గోదావరి చెంత ఆధ్యాత్మిక పరవళ్లు

ఫ నేడు కార్తిక మాసం తొలి సోమవారం

ఫ ప్రత్యేక శోభను

సంతరించుకొన్న ఆలయాలు

ఫ అభిషేకాలు, అర్చనలు,

దీపారాధనలకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement