ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): శ్రీ గౌతమి వ్యాయామ కళాశాల శత సహస్ర ఉత్సవాలు నిర్వహించుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లోని గౌతమి కళాశాల శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. కళాశాల కార్యదర్శి అడ్డూరి వెంకటరమణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దుర్గేష్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, టీడీపీ నేత యర్రా వేణుగోపాలరాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆధునిక జిమ్‌లు ఎన్ని వచ్చినా ఎందరో విద్యార్థులు ఈ కశాశాలను సద్వినియోగం చేసుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారన్నారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో నూరు వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీగౌతమి వ్యాయామ కళాశాల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేత యర్రా వేణుగోపాలరాయుడు, ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఎం.ప్రభాకరరావు, మొఘల్ బిర్యాని అధినేత ఎండీ ఇస్మాయిల్ తాహిర్, బిగ్ వింగ్ ఎండీ ఇమ్మణి బుల్లి వెంకటరావు కళాశాల ప్రగతిని వివరించారు. అనంతరం శ్రీఅడ్డూరి నారాయణరావు మెమోరియల్ 3వ ఏపీ సౌత్ ఈస్ట్ కోస్ట్ ఓపెన్ డీడ్ లిఫ్ట్ అండ్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్స్, కేరళలో జనవరిలో జరిగే సౌత్ ఇండియా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్ సెలక్షన్స్ ప్రారంభించారు.


