పోలీస్‌.. ‘పోల్‌’ కవాతు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌.. ‘పోల్‌’ కవాతు

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

రామచంద్రపురం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ఆదేశాల మేరకు రామచంద్రపురం డీఎస్పీ ఎం.శేషు ఆధ్వర్యంలో మంగళవారం పోలీసు కవాతు నిర్వహించారు. ఎస్సైలు ఎస్‌.నాగేశ్వరరావు, ఎం.లక్ష్మణ్‌, అడిషనల్‌ ఎస్సై సింహాద్రి, పోలీస్‌ సిబ్బంది, మహిళా పోలీసులతో కలసి పట్టణంలో రాజగోపాల్‌ సెంటర్‌ నుంచి బీఎస్‌ఎం కళాశాల వరకు ఫ్లాగ్‌ మార్చ్‌, ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించారు. రాబోయే మున్సిపల్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆయా ప్రాంతాల్లో రౌడీషీటర్లు, గత కేసుల్లో నిందితులపై చట్టప్రకారం బైండోవర్‌ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌లు, ఫుట్‌ పెట్రోలింగ్‌లు నిర్వహించి ప్రజల్లో భద్రతపై నమ్మకం కలిగించాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, సమస్యాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశాలను పరిశీలించిన డీఎస్పీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలను కాపాడటంలోను అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చూడాలని చెప్పారు. ఎన్నికల నియమనిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement