ముందు పులి.. వెనుక అధికారులు | - | Sakshi
Sakshi News home page

ముందు పులి.. వెనుక అధికారులు

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

● రోజుకో చోటు మార్చుతున్న టైగర్‌

● ప్రస్తుతం కరగపాడు

అటవీ ప్రాంతంలో మకాం

● పట్టుకునేందుకు కొనసాగుతున్న చర్యలు

దేవరపల్లి: రోజుకో చోటు మార్చుతూ, యథేచ్ఛగా సంచరిస్తున్న పులిని పట్టుకోవడానికి అధికారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. పంట పొలాల నుంచి మెట్ట ప్రాంతానికి, అక్కడి నుంచి రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి పులి చేరింది. ప్రస్తుతం గోపాలపురం మండలం కరగపాడు రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎన్‌ఎస్‌టీఆర్‌ (శ్రీశైలం), త్రిపుల్‌ఆర్‌ రాజమహేంద్రవరం, పూనే రెస్క్యూ బృందాలు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దాదాపు 80 మంది జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితిలోనూ టైగర్‌ను పట్టుకుని తీరతామని పూనే రెస్క్యూ టీం చెబుతున్నప్పటికీ అది చిక్కడం లేదు. జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు అధికారులు గమనిస్తున్నారు.

మెట్టపై బోను ఏర్పాటు

గోపాలపురం మండలం కోమటికుంట ప్రాంతంలోని మాతగమ్మ మెట్టపై సోమవారం రాత్రి వరకు తిష్ట వేసిన పులిని పట్టుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మెట్టపై కర్రలతో బడ్డీ ఏర్పాటు చేసి, దానిపై నుంచి మత్తు ఇంజెక్షన్‌ ఇవ్వడానికి రెస్క్యూ బృందం సభ్యులు చర్యలు చేపట్టారు. మెట్టపై బోను ఏర్పాటు చేశారు. పులి దాగిన ప్రదేశాన్ని డ్రోన్‌ కెమెరాతో పరిశీలించారు. కాగా.. పులి అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు నెమ్మదిగా బయలుదేరి ఉదయానికి మండలంలోని కరగపాడు రిజర్వు పారెస్ట్‌లోకి చేరినట్టు గుర్తించారు. ముందు పులి, వెనుక అధికారులు పయనిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అక్కడ నుంచి పోలవరం ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement