ఈ మోసాలు.. ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

ఈ మోసాలు.. ఇంకెన్నాళ్లు?

Oct 10 2026 1:10 AM | Updated on Oct 10 2026 1:10 AM

డ్రామా బయటపడింది

చంద్రబాబు ప్రభుత్వం తొలి నుంచీ 34 శాతం రిజర్వేషన్‌ అంటూ డ్రామా చేస్తోంది. జీవోతో రిజర్వేషన్‌ రాదని తెలిసి కూడా సుప్రీం కోర్టుకు వెళ్లడం బీసీలను మభ్యపెట్టేందుకు యత్నించడమే. రాజ్యాంగ సవరణ చేయకుండా జీవోలతో కాలం గడిపితే కోర్టులు కొట్టేస్తాయని మాకు ముందే తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఆ డ్రామా బయటపడింది.

– కుడుపూడి వెంకటేశ్వరరావు (బాబు),

వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు

బీసీలకు జగన్‌ పెద్దపీట

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కోనసీమలో బీసీలకు 60 శాతం పదవులు దక్కాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. మార్కెట్‌ యార్డులు, ఆలయ కమిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు పెద్దపీట వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్ల కాలంలో కోనసీమలో నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు.

– మల్లాడి బాబ్జి,

మాజీ సర్పంచ్‌, పల్లం, కాట్రేనికోన మండలం

ఎన్నికల ముందు అమలు చేయలేని హామీలు ఇవ్వడం.. ఓట్ల కోసం రాజకీయ గిమ్మిక్కులు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాటి. ఓపక్క స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణం.. ఇంకోపక్క హామీల అమలులో ప్రజలను పూర్తిగా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ రిజర్వేషన్‌ పెంపును చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. తొలుత హైకోర్టు, తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు మోసం బట్టబయలైందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.

సాక్షి, అమలాపురం: బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని స్పష్టం చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో జీవోతో రిజర్వేషన్‌ రాదని తెలిసినా ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరగడం బీసీలను మోసం చేయడమేనని బీసీ నేతలు విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామంటూ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తోంది. కానీ ఆచరణలో మాత్రం కోనసీమ జిల్లాలో బీసీలకు నామినేటెడ్‌ పదవులు దక్కకపోవడం, రాజకీయ ప్రాతినిధ్యంలో వివక్ష కొనసాగడం పట్ల ఆయా వర్గాల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు భర్తీ చేసిన నామినేటెడ్‌ పదవులు, వివిధ కార్పొరేషన్లు, మార్కెట్‌ యార్డులు, ఆలయ కమిటీల్లో బీసీలకు ఎన్ని దక్కాయో లెక్కలు తీస్తే అసలు పరిస్థితి అర్థమవుతుంది.

ప్రజా వ్యతిరేకతకు భయపడి రిజర్వేషన్‌ మాయ

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో బీసీలకు పెద్దపీట వేస్తూ పదవులు ఇస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బీసీలను పూర్తిగా పక్కన పెట్టిందని చర్చ జరుగుతోంది. వాస్తవానికి జీవో కాదు.. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలని మొదటి నుంచి బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయకుండా స్థానిక ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతకు భయపడి బీసీ రిజర్వేషన్‌ పేరుతో మాయ చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. గత స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ పారిపోయిన విషయాన్ని బీసీ నేతలు గుర్తుచేస్తున్నారు.

34 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు

తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు

ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత

50 శాతం పరిమితిని

మించరాదని స్పష్టీకరణ

రిజర్వేషన్‌పై చంద్రబాబు

డ్రామా బట్టబయలు

మండిపడుతున్న బీసీ సంఘాలు

సరైన సమయంలో

బుద్ధిచెబుతామంటూ హెచ్చరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement