వైద్య కాంట్రాక్ట్‌ ఉద్యోగుల మౌన పోరాటం | - | Sakshi
Sakshi News home page

వైద్య కాంట్రాక్ట్‌ ఉద్యోగుల మౌన పోరాటం

Oct 10 2026 1:10 AM | Updated on Oct 10 2026 1:10 AM

అమలాపురం టౌన్‌: తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అమలాపురం నల్లవంతెన వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో కూర్చుని శుక్రవారం మౌన పోరాటం చేశారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం క్రమబద్ధీకరించే వరకు నిరసనలు వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. ధర్నాలో తొలి రోజు గురవారం ఆ ఉద్యోగులు గొంతెత్తి తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేస్తే శుక్రవారం నాటి దీక్షా శిబిరంలో మౌనంగా కూర్చుని ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. తమ డిమాండ్లతో కూడిన నినాదాలను ప్లకార్డులపై ముద్రించి వాటిని చేతపట్టుకుని మౌనంగా ధర్నా చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తాము రోగులకు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తెరిగి తమ డిమాండ్లను అమలు చేయాలని వారు కోరుతున్నారు. అమలాపురంలో జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ దీక్ష, ధర్నా శిబిరంలో జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు 63 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 44 మంది ఫార్మాసిస్ట్‌లు, 152 మంది స్టాఫ్‌ నర్సులు పాల్గొంటున్నారు. వీరి నిరసనకు కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల యూనియన్‌ జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు జి.అరుణకుమారి, బి.అచ్యుతవల్లి, ఎం.శివకుమారి, ల్యాబ్‌ టెక్నీషియన్ల సంఘం ప్రతినిధులు కె.నరేష్‌కుమార్‌, ఎం.నరేష్‌, శ్రీనివాస్‌ తదితరులు నాయకత్వం వహించారు.

పండుగల్లో

అప్రమత్తత అవసరం : ఎస్పీ

అమలాపురం టౌన్‌: రాబోయే వారం రోజుల్లో జరగబోయే జాతరలు, పండుగల దృష్ట్యా జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ఆదేశించారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన జిల్లా నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మీనా మాట్లాడారు. పండుగలు, జాతరులు, ఉత్సవాలు, ఊరేగింపులు జరిగే పట్టణాలు, గ్రామాలను గుర్తించి స్థానిక ప్రజలతో శాంతి, సమన్వయ కమిటీలు వేసి కుల, మత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌ దర్యాప్తులో సాంకేతికత వినియోగాన్ని అధికంగా ఉపయోగించుకోవాలని సూచించారు. డ్రోన్‌ కెమెరాలు, సీసీ ఫుటేజీలు దర్యాప్తులో ఉపకరిస్తాయన్నారు. సోషల్‌ మీడియాపై నిరంతర నిఘా కొనసాగాలని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో రౌడీ షీటర్లు, పాత కేసుల్లోని నిందితులపై బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాంటి పట్టణాలు, గ్రామాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌లు, పెట్రోలింగ్‌లు విరివిగా నిర్వహించాలన్నారు. మున్సిపల్‌, పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓట్లు వేసేందుకు వారికి అవకాశం కల్పిస్తూ ఽధైర్యం చెప్పాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని ఎస్పీ మీనా వివరించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ మహేంద్ర మత్తేతో పాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

యువజనోత్సాహం

అమలాపురం రూరల్‌: జిల్లా యువజనోత్సవాల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కాకినాడ యువజన సర్వీసుల శాఖ సెట్రాజ్‌ ఆధ్వర్యంలో 2027 జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా అమలాపురం భట్లపాలెం బోనం వెంకట చలమయ్య ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. బీవీసీ కళశాల చైర్మన్‌ బోనం కృష్ణ సతీష్‌ జ్యోతిప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఎంపీ హరీష్‌ మాథుర్‌ పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement