వైద్య సేవలపై సమ్మెట | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలపై సమ్మెట

Oct 10 2026 1:10 AM | Updated on Oct 10 2026 1:10 AM

అమలాపురం టౌన్‌: వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టడంతో అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వారి ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయడంలో చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా వారు సమ్మె కొనసాగిస్తున్నారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 22 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులను బహిష్కరించి గత నాలుగు రోజులుగా సమ్మెలో ఉన్నారు. వారిలో 14 మంది స్టాఫ్‌ నర్సులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు ఎక్స్‌ రే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. మిగతా ముగ్గురు ఒక్కొక్కరు వంతున పలు డిపార్ట్‌మెంట్‌లలో సేవలు అందిస్తున్నారు. 14 మంది స్టాఫ్‌ నర్సులు సమ్మెలో ఉండడంతో వారి స్థానంలో నర్సింగ్‌ విద్యార్థులతో ఆ సేవలు చేయిస్తున్నారు. దీంతో రోగులు సత్వర సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముగ్గురు కాంట్రాక్ట్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ సమ్మెలో ఉండడంతో ఒక రెగ్యులర్‌ టెక్నీషియన్‌ని వేరే విభాగం నుంచి తీసుకొచ్చి విదులు నిర్వర్తింపజేస్తున్నారు.

సిబ్బంది కొరతతో.. రిపోర్టులు ఆలస్యం..

రోజుకు 150 నుంచి 200 వరకు పరీక్షలు చేసి రిపోర్టులు ఇవ్వాల్సి ఉండగా, ఒకే ఉద్యోగి కావడంతో 40 పరీక్షలు చేయడం గగనమవుతోంది. ఈ ప్రభావం రోగులపై పడుతోంది. ఎక్స్‌ రే విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పైకి చెబుతున్నా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మెతో తలెత్తిన సమస్యలతో సతమతమవుతున్నారు. రోగులకు గతంలో మాదిరిగా పూర్తి స్థాయి వైద్య సేవలు అందించలేక చేతులెత్తేస్తున్నారు.

సమ్మె బాట పట్టిన

22 మంది ఉద్యోగులు

ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు,

ల్యాబ్‌ టెక్నీషియన్లు లేక ఇబ్బందులు

రోగుల అవస్థలు

ఉద్యోగుల సమస్యల

పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement