మత్స్యకార గ్రామాల్లోకి..
సాక్షి, అమలాపురం: ధవళేశ్వరం ఎగువ ప్రాంతాల్లో గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దిగువనున్న కోనసీమ జిల్లాలో మాత్రం వరద పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా పది మండలాల్లోని సుమారు 19 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. రహదారులు, కాజ్‌వేలు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యకార గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరగా, లంకల్లోని ఉద్యాన, ఆక్వా పంటలకు ముప్పు ఏర్పడింది. పాడి రైతులు తమ పశువులను ఏటిగట్ల పైకి తరలించగా, సంచార కుటుంబాలు గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నాయి.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 8 గంటల వరకూ పెరుగుతూ వచ్చిన వరద.. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నిలకడగా ఉంది. ఆ తరువాత నుంచి తగ్గుముఖం పడుతోంది. బ్యారేజీ నుంచి రాత్రి 9 గంటల సమయానికి ===== క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో, జిల్లాలో వరద ఉధృతి పెరుగుతూ లంక గ్రామాలను ముంచుతోంది. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వీటితో పాటు మలికిపురం, సఖినేటిపల్లి, ఐ.పోలవరం, అల్లవరం, కాట్రేనికోన, కె.గంగవరం మండలాల్లోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీపాయలను ఆనుకుని ఉన్న లోతట్టు గ్రామాల్లోకి వరద చేరింది.
ఫ పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేటతో పాటు కె.ఏనుగుపల్లి, జొన్నలంక, శివాయిలంక, పల్లిపాలెం ప్రాంతాలు ఆదివారం మధ్యాహ్నం నుంచి వరద ముంపులో చిక్కుకున్నాయి. కె.ఏనుగుపల్లి లంకలోకి వరద నీరు చేరడంతో రోడ్లు నీట మునిగాయి.
ఫ ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాణేలంక శివారు పల్లిపాలెం, గురజాపులంక, చింతపల్లిలంకలను వరద చుట్టుముట్టింది. గురజాపులంక రోడ్డు పూర్తిగా నీట మునగడంతో రాకపోకలు నిలిపివేశారు.
ఫ మలికిపురం మండలం రామరాజులంక, దిండిలోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం నుంచి అప్పనరామునిలంక వెళ్లే రోడ్డు ముంపులో చిక్కుకుంది.
ఫ ఎగువన తగ్గినా..
జిల్లాలో పెరుగుతున్న వరద
ఫ నేటి ఉదయం వరకు
ఉధృతి కొనసాగే అవకాశం
ఫ నీట మునిగిన లంక, మత్స్యకార గ్రామాలు
ఫ 10 మండలాల్లోని
19 గ్రామాలపై ప్రభావం
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఆదివారం మిగులు జలాల విడుదల (క్యూసెక్కులలో)
సమయం విడుదలైన జలాలు
ఉదయం
6.00 14,40,381
7.00 14,52,149
8.00 14,61,222
9.00 14,61,222
10.00 14,61,222
11.00 14,61,222
మధ్యాహ్నం
12.00 14,61,222
1.00 14,61,222
2.00 14,61,222
3.00 14,55,258
సాయంత్రం
4.00 14,40,621
5.00 14,29,124


