అమలాపురం రూరల్: భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. మంగళవారం అమరావతి నుంచి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించి 22 భూములు పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ రీ సర్వే అంశాల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ రైతులు తమ భూములకు సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయం, రెవెన్యూ వనన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే అవగాహనను క్షేత్రస్థాయిలో భూ యాజమాన్యాలకు కల్పించాలన్నారు. భూ పరిపాలనలో పారదర్శకతకు రెవెన్యూ క్లినిక్‌ల నిర్వహించాలన్నారు.
సమన్వయంతో అంబేడ్కర్ జయంతి
● అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలను రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.
వేగంగా జాతీయ రహదారిపై విద్యుత్ లైన్ల తొలగింపు
పాసర్లపూడి – దిండి సెక్షన్లలో జాతీయ రహదారిని క్రాస్ చేస్తూ ఉన్న నాలుగు ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను త్వరితగతిన తొలగించేందుకు ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులు, జాతీయ రహదారుల ఇంజినీర్లు చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏపీ ట్రానన్స్‌కో, జాతీయ రహదారుల ఇంజినీర్లు ఆర్డీవోతో నిర్వహించిన సమావేశంలోమాట్లాడారు. కొత్త లైన్ల ఏర్పాటుకు పరిహారం చెల్లింపుల అంశంపై వన్ టైం సెటిల్మెంట్ పద్ధతిలో చర్చించి ఈ నెల 10వ తేదీ నాటికి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఓటు ఉన్న కార్మికులకు సెలవు ఇవ్వాలి
ఈ నెల 9, 23 తేదీల్లో పుదుచ్చేరి, తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో ఆ ప్రాంత ఓటర్లు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తుంటే ఆయా తేదీల్లో వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని కార్మిక శాఖకు కలెక్టర్ సూచించారు.


