రైతన్నపై వాతావ‘రణం’
జూన్ నెల నుంచి అక్టోబరు నెల వరకు లోటు వర్షం నమోదైంది. జూన్ నెలలో 4.9, జూలైలో 53.4, ఆగస్టులో 11.4, సెప్టెంబరులో 40.2, అక్టోబరు 15 తరువాత వరకు 50.7 మిల్లీ మీటర్ల లోటు వర్షం నమోదైంది.
● బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, మోంథా తుపాను వల్ల భారీ వర్షాలు కురిశాయి. ఖరీఫ్ ఆరంభంలో కురవాల్సిన వర్షం.. కోతల సమయంలో కురిసి రైతులను నిలువునా ముంచేసింది. వరి 77 వేల ఎకరాలలో, అరటి 3,379, కూరగాయలు 450.71, బొప్పాయి 43.48, పువ్వులు 39.53, పసుపు 19.76, తమలపాకు 7.90 ఎకరాల్లో పంట దెబ్బతింది.


