గెలగింత!
దిండి సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు పెరట్లో కాసిన అరుదైన అరటి గెల అబ్బుర పరుస్తోంది. పిసంగ్ సెరిబు రకానికి చెందిన ఈ అరటి గెల మలేషియా, ఇండోనేషియాల్లో పెరుగుతుందని కొవ్వూరు అరటి పరిశోధన సంస్థ సైంటిస్ట్ కె.రవీంద్ర తెలిపారు. ఏడాదికి తయారయ్యే ఈ గెల 7 అడుగుల పొడవు, 200 అత్తాలతో ఉంది. ఆకర్షణీయంగా ఉండే ఇటువంటి గెలలను అలంకరణలో ఎక్కువగా వాడతారని ఆయన తెలిపారు.
– మలికిపురం


