ప్రైవేటీకరణ ఆలోచన దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ నేతలు బోస్, జగ్గిరెడ్డి
● రచ్చబండలో కోటి సంతకాల సేకరణ
కె.గంగవరం: పేదలకు వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే, నేటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించేందుకు యత్నించడం దుర్మార్గమని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరం మండలం దంగేరులో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణకు రచ్చబండ నిర్వహించారు. మండల పార్టీ కన్వీనర్ పెట్టా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు ముందుగా డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ బోస్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం దారుణమన్నారు. ఈ విధానంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. ముఖ్య అతిథి జగ్గిరెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలు తమ పిల్లల భవిష్యత్ కోసం రాబోయే రోజుల్లో వైద్య విద్య అందుబాటులో ఉండాలని కాంక్షిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోటి సంతకాలు చేస్తున్నారన్నారు. మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య విద్యపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కోటి సంతకాల ద్వారా ప్రజలు నిరసన తెలియజేస్తున్నారన్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కోటి సంతకాల ద్వారా ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పబడుతున్నారని ఇప్పటికై నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. అనంతరం జగ్గిరెడ్డి సంతకాల సేకరణ నిర్వహించారు.
ప్రైవేటీకరణ ఆలోచన దుర్మార్గం


