
వైఎస్సార్ సీపీలో నియామకాలు
మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామంలోని మధ్యలంకను గ్రామ పంచాయతీ అనుమతితో ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతంగా ప్రకటిస్తామని జిల్లా ఫారెస్టు అధికారి ఎంవీ ప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారం బోటులో సిబ్బందితో వెళ్లి మధ్యలంకలో నివాసం ఉంటున్న పక్షులను పరిశీలించారు. ఆగ్నేయాసియా నుంచి వలస వచ్చిన ఓపెన్ బిల్ స్టార్క్ పక్షులు గత మూడేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నాయన్నారు. వలస వచ్చిన పక్షులు నత్తలను ఆహారంగా తింటాయన్నారు. మధ్యలంకలో సుమారుగా 10 వేల వరకు పక్షులు ఉంటాయని చెప్పారు. వాటి పరిరక్షణ కోసం ఆ ప్రాంతాన్ని రిజర్వు ప్రాంతంగా ప్రకటించేందుకు కార్యాచరణ చేపడతామన్నారు.

వైఎస్సార్ సీపీలో నియామకాలు