ఏపీకి వాయుగుండం టెన్షన్‌.. తిరుమలలో భారీ వర్షం | Heavy Rains Forecast For Next 5 Days Due To Deep Depression, Check Rainfall Weather Update | Sakshi
Sakshi News home page

AP Rainfall Update: ఏపీకి వాయుగుండం టెన్షన్‌.. తిరుమలలో భారీ వర్షం

Oct 22 2025 9:08 AM | Updated on Oct 22 2025 11:29 AM

IMD Says Heavy Rain Forecast To AP For five Days

సాక్షి, అమరావతి: ఏపీని వాయుగుండం టెన్షన్‌ పెడుతోంది. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్‌’, మరికొన్ని జిల్లాలకు ‘ఎల్లో’ ఎలర్ట్‌లను జారీ చేసింది. మరోవైపు.. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశముందని ఐఎండీ తెలిపింది. క్రమంగా నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. తర్వాత 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. ఇది తుపానుగా బలపడే అవకాశముందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో శుక్ర, శనివారాల్లో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని కొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బుధవారానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

AP: ఐదు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

తిరుమలలో భారీ వర్షం.. 
తిరుమలలో రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు టీటీడీ సిబ్బంది సూచనలు అందిస్తోంది.

ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రాయచోటి ప్రాంతంలో పూర్తిగా నిండిన పింఛా ప్రాజెక్టు.. రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షాల కారణంగా జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతున్నాయి. దీంతో, కడప, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

ఐదు రోజులు వానలే.. 
రాబోయే ఐదు రోజులూ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా ​కురిసే అవకాశం ఉందని  అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థలు తెలిపాయి. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement