
లోపం ఎక్కడుంది?
రాయవరం: మండల కేంద్రం రాయవరంలో బుధవారం జరిగిన ప్రమాద ఘటన పలు లోపాలను ఎత్తి చూపుతోంది. ఈ ఘటనలో తప్పెవరిది అనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలో పలు ఊహాగానాలున్నాయి. దర్యాప్తు పూర్తయితే గానీ ప్రమాదానికి కారణం చెప్పలేని పరిస్థితి నెలకొంది. చిచ్చుబుడ్డిని దట్టించే సమయంలో ప్రమాదం జరిగిందా.. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది నిర్ధారించలేకపోతున్నారు.
భీతావహ పరిస్థితి
ప్రమాద స్థలం మొత్తం మరుభూమిని తలపించింది. ప్రమాదం జరిగిన తర్వాత 7.30 గంటల సమయానికి కూడా ఆరో మృతదేహాన్ని గుర్తించలేక పోయారంటే అసలు పనికి ఎంతమంది ఎక్కడి నుంచి వెళ్తున్నారనేది పక్కాగా నమోదు చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.
నివ్వెరపోయిన అధికారులు, ప్రజలు
ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక అధికారులు కూడా సిబ్బందితో వచ్చి ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఘటనా స్థలిలో మృతదేహాలు ఉన్న తీరును చూసి అధికారులకు నోట మాట రాలేదు. అక్కడి పరిస్థితిని చూసిన వారు చలించిపోయారు.
ఘటనా స్థలిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, రామచంద్రపురం ఆర్‌డీవో అఖిల, డీఎస్పీ బి.రఘువీర్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తదితరులు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.
అయోమయంలో అధికారులు
పనికి వెళ్లిన కూలీలెందరో?
మృతుల గుర్తింపులో జాప్యం

లోపం ఎక్కడుంది?