బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లను తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లను తొలగించాలి

Aug 1 2025 12:12 PM | Updated on Aug 1 2025 12:12 PM

బెల్ట

బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లను తొలగించాలి

అమలాపురం టౌన్‌: జిల్లాలో విచ్చలవిడిగా పెరిగిపోయిన మద్యం బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లను తక్షణమే తొలగించి పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం అమలాపురంలో ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. అల్లవరం మండలం కొమరిగిరిపట్నంలో గత జూన్‌లో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో పాత్రధారులను అరెస్ట్‌ చేసి, సూత్రధారులను వదిలేశారని ఆరోపించారు. బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లు ఉంటే తక్షణమే తొలగించాలని ఇటీవల మద్యం అమ్మకాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సాక్షాత్తూ కలెక్టర్‌ ఆదేశించినా ఎకై ్సజ్‌ అధికారులు పట్టించుకోలేదన్నారు. అమలాపురంలోని ఎకై ్సజ్‌ కార్యాలయం సమీపంలోనే లైసెన్స్‌ మద్యం షాపుల వద్ద అనధికారికంగా పర్మిట్‌ రూమ్‌లు ఉన్నాయన్నారు. ఇక అమలాపురంలో అనేక చోట్ల బెల్ట్‌ షాపులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మద్యం షాపుల యాజమానులు, ఎకై ్సజ్‌ అధికారులు కుమ్మక్కు కావడంతో బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌ల నిర్వహణ జరుగుతోందని స్పష్టం చేశారు. వీటిపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్‌ సీపీ తరఫున జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు.

శ్రీవారి ఆలయానికి

ముడి వెండి విరాళం

రాయవరం: మండల కేంద్రమైన రాయవరంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం దాతలు ముడి వెండిని విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన దుర్గపు వెంకన్నబాబు, సత్యరత్నభవాని దంపతులు, కుటుంబ సభ్యులు కలసి రూ.1.01 లక్షల విలువైన ముడి వెండిని మకర తోరణం తయారీ కోసం సమర్పించారు. వారిని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్‌ వుండవిల్లి రాంబాబు, స్థానిక నేతలు వల్లూరి శ్రీనివాస చౌదరి, పులగం శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు అభినందించారు. ముక్కోటి ఏకాదశి సమయానికి మకర తోరణం సిద్ధం చేసేందుకు ఆలయ కమిటీ ప్రయత్నిస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

రేపు కలెక్టరేట్‌ ఎదుట ఫ్యాప్టో ధర్నా

అమలాపురం టౌన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్న డిమాండ్‌తో కలెక్టరేట్‌ ఎదుట శనివారం ఉదయం ధర్నా చేయనున్నట్టు ఫ్యాప్టో జిల్లా శాఖ అధ్యక్షుడు ఎంటీవీ సుబ్బారావు తెలిపారు. ఈ ఆందోళనను జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమలాపురంలోని యూటీఎఫ్‌ హోమ్‌లో గురువారం జరిగిన ఫ్యాప్టో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ అనేక రూపాల్లో, అనేక సార్లు ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఈ ధర్నా చేపడుతోందన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు అప్పగించకూడదన్నారు. సమావేశంలో ఫ్యాప్టో జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి దొరబాబు, ఫ్యాప్టో ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పెంకే వెంకటేశ్వరరావు, సరిదే సత్య పల్లంరాజు, గిడ్డి వీవీ సత్యనారాయణ, సిరాజ్‌, షబ్బీర్‌ హుస్సేన్‌, ప్రజా సంఘాల ప్రతినిధులు జీవీ రమణ, దుర్గాప్రసాద్‌, జి.రవి, జి.వెంకటేశ్వరావు, పెన్నాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బెల్ట్‌ షాపులు, పర్మిట్‌  రూమ్‌లను తొలగించాలి 1
1/2

బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లను తొలగించాలి

బెల్ట్‌ షాపులు, పర్మిట్‌  రూమ్‌లను తొలగించాలి 2
2/2

బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లను తొలగించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement