నెల క్రితం కిడ్నాప్‌.. ఇప్పుడు ఎముకల గూడుగా.. 

Young Girl Dead Body Found Mystery In Tamil Nadu - Sakshi

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): సేలం జిల్లాలో గత 6వ తేదీన అదృశ్యమైన ఓ కళాశాల విద్యార్థిని మృతదేహం తలలేకుండా బావిలో తేలుతున్న ఎముకల గూడుగా బయటపడింది. వివరాలు.. సేలం, కారిపట్టి, పిన్నాంపల్లికి చెందిన కాశీ విశ్వనాథన్‌కు చెందిన వ్యవసాయ బావిలో తల లేకుండా ఎముకల గూడుగా తేలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఎముకల గూడును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతురాలు ధరించిన దుస్తుల ఆధారంగా గత 6వ తేదీ అదృశ్యమైన మిన్నాంపల్లి ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన కన్మణి కుమార్తె తిత్తిమిలా (19) మృతదేహాంగా గుర్తించారు. ఈమె సేలం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్టు తెలిసింది. తల్లిదండ్రులు దుస్తులను చూసి తిత్తిమిలా అని నిర్ధారించారు. తల కనబడకపోవడంతో బావిలో   తీవ్రంగా గాలిస్తున్నారు.  

చదవండి: స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top