కోడలిపై పోలీస్ మామ అత్యాచారం..

UP Woman Constable Abuse by Policeman Father In Law In Meerut - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ పోలీస్ కుటుంబంలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్‌గా  పనిచేస్తున్న కోడలిపై అదే శాఖలో పనిచేస్తున్న ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలు.. మీరట్‌లో రిజర్వ్ ప్రోవిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మహిళ, బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆమె మామ నజీర్ అహ్మద్ ఇంట్లోకి ప్రవేశించి కోడలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం  ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.

అయితే తనపై జరిగిన దారుణం గురించి  భర్త అబిద్‌కు చెప్పింది. దీంతో తన భార్య చెప్పేది పూర్తిగా వినకుండానే ట్రిపుల్ తలాఖ్ ఇచ్చేశాడు. దీంతో ఆమె మీరట్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది.  నిందితుడు నజీర్‌పైనా, బాధితురాలి భర్త అబీద్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అబీద్‌తో మూడేళ్ల క్రితం బాధితురాలుకి వివాహమైంది. కోడలిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టి నాటి నుంచీ అత్తింటివారు తనను అదనపు కట్నం కోసం వేధించేవారిని ఆమె  ఫిర్యాదులో పేర్కొంది.
చదవండి: 57 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. రెండో భార్య ఏంచేసిందంటే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top