భర్తను చంపడానికి ప్రియునితో కలిసి స్కెచ్‌

Wife And Lover Murder Husband For Interfering Their Relationship - Sakshi

భర్త హత్యకు సుపారీ 

నిందితురాలితో పాటు ప్రియుడు

కిరాయి హంతకుల అరెస్ట్‌  

శిడ్లఘట్ట: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అడ్డుగా ఉన్న భర్తను సుపారీ ఇచ్చి హత్యకు స్కెచ్‌ వేసిన ఘటనలో శిడ్లఘట్ట పట్టణ పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. పట్టణంలో నివాసం ఉంటున్న మేస్త్రి గోవిందప్ప, ఆయన భార్య సుమిత్ర భార్య భర్తలు. ఇదిలా ఉంటే ఈనెల 18న తెల్లవారుజామున గోవిందప్ప మారుతి నగర్‌లో ఇంటి ముందు నుంచి వెళ్తున్న సమయంలో అతడిని తుపాకీతో కాల్చారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల విచారణలో సుమిత్రకు మునికృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సుమిత్రతో పాటు ఆమె ప్రియుడు మునికృష్ణ, అదే గ్రామానికి చెందిన రామకృష్ణ, ప్రవీణ్, హరీశ్, చిన్నయను అరెస్ట్‌ చేశారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top