ఇదేం బుద్ధి భిక్షపతి.. మైనర్‌పై 4 రోజులుగా అఘాయిత్యం

Warangal Retired Employee Molested Minor Girl From Four Days - Sakshi

 బాలికపై నాలుగు రోజులుగా లైంగిక దాడి 

హసన్‌పర్తి: ఇంటి పక్కన ఉండే ఓ మైనర్‌ బాలికపై కన్నేశాడు. ప్రలోభాలకు గురిచేశాడు. లైంగిక దాడికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలోని పరిమళ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన బింగి భిక్షపతి విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు. ఇంటి వద్దే ఉంటున్న భిక్షపతి కన్ను.. ఇంటి పక్కనే 8వ తరగతి చదువుతున్న బాలికపై పడింది.

ఎలాగైనా బాలికను లొంగదీసుకుని కామవాంఛ తీర్చుకోవాలనుకుని.. ఆమెకు వివిధ రకాల వస్తువులు కొనిస్తూ తన వలలో వేసుకున్నాడు. నాలుగు రోజులుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అయితే భిక్షపతి ఇంటికి బాలిక వెళ్తుండటంతో ఆమె బంధువు గమనించింది. ఈ క్రమంలోనే విషయం ఆ నోటా.. ఈ నోటా కాలనీ అంతా పాకింది. దీంతో కాలనీవాసులు 100కు ఫోన్‌ చేయడంతో సంఘటన స్థలానికి స్థానిక ఎస్సైలు సతీష్‌కుమార్, సంపత్‌కుమార్‌ చేరుకున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగి భిక్షపతిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. 

   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top