కరోనా వచ్చిందంటూ హేళన..

Villagers Ridicule on Man COVID 19 Commits Suicide Anantapur - Sakshi

మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య 

బ్రహ్మసముద్రం: అనుమానం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కరోనా వైరస్‌ వచ్చిందంటూ హేళన చేయడంతో ఆ వ్యక్తి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండల పరిధిలోని ముప్పులకుంటలో గత ఐదు రోజుల క్రితం బోయ రామచంద్రప్ప కరోనా వైరస్‌తో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన చాకలి నాగన్న అతన్ని గ్రామంలో చనిపోకముందు పలకరించాడని అతనితో గ్రామస్తులు దూరంగా ఉంటూ వచ్చారు. ‘నీకు కూడా కరోనా వైరస్‌ సోకింది’దంటూ హేళన చేశారు.

దీంతో మనస్థాపానికి గురైన నాగన్న.. గురువారం మధ్యాహ్నం ముప్పులకుంట – కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో పడి ఉండగా అటుగా వెళ్లిన పశువుల కాపరులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top