దారుణం: ఉలిక్కి పడిన ‘ఉన్నావ్’‌‌

Unnao Case: 2 Young Girls Found Unconscious In Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా మరో ఇద్దరు మైనర్‌ బాలికలు అఘాయిత్యానికి బలైపోయారు. పశువులను​ మేపడానికి తీసుకెళ్లిన అమ్మాయిలు విగత జీవులుగా కనిపించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఉన్నావ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్‌ బాలికలు పశువులను మేపడానికి వెళ్లి అదృశ్యమయ్యారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు తమ పిల్లలు చనిపోయి కనిపించారు. షాక్‌కు‌ గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకి చేరుకున్న పోలీసులు చనిపోయిన ఇద్దరి శవాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

వారి మృతదేహాలు ఉన్న చోట నురుగు కనిపించిందని, విష ప్రయోగం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసు అధికారి ఆనంద్‌ కులకర్ణి తెలిపారు. తమకు ఎవరితోను శతృత్వం లేదని మృతురాలి సోదరుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తుకు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీస్‌ అధికారి ఆనంద్‌ తెలిపారు. 
చదవండి: పోర్న్‌ చూస్తున్నారా?.. మెసేజ్‌ వస్తుంది!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top