అనాథలమని ఆవేదన చెంది.. ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య..

Three Sisters Suicide 21 days after grandmothers Death In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: తమకు ఎవరూ లేరనే ఆవేదనతో ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘోరం కర్ణాటకలోని తమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా బరకనహాల్‌ తాండాలో గురువారం వెలుగుచూసింది. అక్కాచెల్లెల్లైన రంజిత924), బిందు(21),చందన(18)ల తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే మరణించారు. వీరిని అమ్మమ్మ పోషిస్తోంది. ఆమె కూడా మూడు నెలల క్రితం మరణించడంతో ముగ్గురూ కుంగిపోయారు.

తాము అనాథలం అయిపోయామని బాధపడేవారు. రంజిత, బిందు ఓ గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. చందన పీయూసీ చదువుతోంది. 9 రోజుల నుంచి ముగ్గురూ ఇంటి నుంచి బయటకు రాలేదు. గురువారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు విషయాన్ని తెలిపారు. వారు వచ్చి ఇంటి పైకప్పు తీసి పరిశీలించగా ముగ్గురూ ఉరివేసుకున్నట్లు కనిపించారు. మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటిని చిక్కనాయకనహళ్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్గానికి తరలించారు.
చదవండి: నిబంధనలకు ‘నిప్పు’.. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top