స్కాలర్‌షిప్‌ దరఖాస్తు కోసం వెళ్లిన బాలికపై హత్యాచారం | Teenage Girl Molested In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

టీనేజ్‌ బాలికపై హత్యాచారం

Aug 26 2020 3:53 PM | Updated on Aug 26 2020 3:54 PM

Teenage Girl Molested In Uttar Pradesh - Sakshi

యూపీలో టీనేజ్‌ బాలికపై లైంగిక దాడి, హత్య

లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. 18 సంవత్సరాల బాలికపై హత్యాచార ఘటన లఖింపూర్‌ ఖేరి జిల్లాలోని నిమ్‌గాం ప్రాంతంలో వెలుగుచూసింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడవగా పో​లీసులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. ఆన్‌లైన్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తును పూర్తిచేసేందుకు బాలిక సోమవారం సమీప పట్టణానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్టు పోస్ట్‌మార్టంలో వెల్లడైందని, తమకు లభించిన ఆధారాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ సత్యేంద్ర కుమార్‌ వెల్లడించారు.

కాగా, ఈ ఉదంతంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఈ ఘటనను యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ దృష్టికి  తీసుకువచ్చారు. యూపీల మహిళల భద్రత ప్రశ్నార్థకంగా ఉందని, ఆన్‌లైన్‌ ఫాం పూర్తిచేసేందుకు వెళ్లిన బాలికపై హత్యాచారానికి పాల్పడ్డారని ప్రియాంక పేర్కొన్నారు. యూపీలో రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను ఆమె కోరారు. చదవండి : 143 మంది అత్యాచారం.. రోజుకో ట్విస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement