వెంగళరావునగర్‌లో విషాదం.. అక్కా తమ్ముడు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

వెంగళరావునగర్‌లో విషాదం.. అక్కా తమ్ముడు ఆత్మహత్య

Published Tue, Apr 2 2024 7:05 AM

sister and younger brother suicide in hyderabad - Sakshi

వెంగళరావునగర్‌: అనుమానాస్పద స్థితిలో అక్కా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహమత్‌నగర్‌ డివిజన్‌ సంతోషగిరి బస్తీలో బి.సాయి(28) నివాసం ఉంటున్నాడు. గత పదేళ్లుగా అతడి సోదరి రాజశ్రీ (30) తమ్ముడి వద్దే ఉంటోంది. నెలలో ఒకటి రెండు రోజులు మాత్రం తన ఇంటికి వెళ్లి వచ్చేది. తరచూ భర్త నర్సింగరావు వేధిస్తున్నాడని తమ్ముడితో చెప్పేది. ఇద్దరూ కలిసి కల్లు సేవించేవారు. సోమవారం సాయి నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు   పోలీసులకు సమాచారం అందించారు.

 సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా సాయి, రాజశ్రీ మృతిచెంది ఉన్నారు. ఇద్దరి మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దాదాపు వారం రోజుల క్రితం వారు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను  స్వాధీనం చేసుకున్నారు. భర్త, తమ్ముడు, పెద్దమ్మ, పెదనాన్న ఎవరూ తనను సరిగ్గా చూసుకోవడంలేదని, తనకు బతకాలని లేదని రాజశ్రీ అందులో పేర్కొంది. వారి  మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement