Bigg Boss Kirik Keerthi: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై బీర్ బాటిల్‌తో దాడి

సాక్షి, బెంగళూరు: బిగ్‌బాస్ కంటెస్టెంట్ కిరిక్ కీర్తిపై బీర్ బాటిల్‌తో దాడి జరిగింది. గురువారం అతను స్నేహితులతో కలిసి సదాశివనగరలో పబ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఫొటో తీశాడు ఫోటో ఎందుకు తీశావంటూ కీర్తి ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అవతలి వ్యక్తి ఆవేశంతో కీర్తిపై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు