Road Accident In YSR District: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి - Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Aug 7 2021 6:36 AM | Updated on Aug 7 2021 8:43 AM

Road Accident In YSR District - Sakshi

మైదుకూరు –బద్వేలు జాతీయ రహదారి డి. అగ్రహారం వద్ద శుక్రవారం అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా, లారీ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

సాక్షి, కడప: మైదుకూరు –బద్వేలు జాతీయ రహదారి డి. అగ్రహారం వద్ద శుక్రవారం అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా, మినీ లారీ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎస్‌ఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో కడపకి వివాహానికి వస్తున్నారు.

మరోవైపు చిత్తూరు నుంచి టమాటా లోడుతో మినీ లారీ  వెళుతోంది. డి.అగ్రహారం వద్ద స్పీడ్‌ బ్రేకర్ల కారణంగా ఇన్నోవా, లారీఎదురెదురుగా ఢీకొని ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను, మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలపారు. 

Advertisement
 
Advertisement
Advertisement