Telangana: Harish Rao Condolences On Patancheru MLA Gudem Mahipal Reddy's Son's Death - Sakshi
Sakshi News home page

పటాన్‌చెర్వు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొడుకు మృతి.. హరీష్‌రావు ఓదార్పు

Jul 27 2023 1:33 PM | Updated on Jul 27 2023 1:40 PM

Patancheru MLA Gudem Mahipal Reddy Son Death Harish Rao Console - Sakshi

పుత్రశోకంతో కుంగిపోయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి.. 

సాక్షి, హైదరాబాద్‌: పటాన్‌చెరువు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్ద కొడుకు విష్ణువర్థన్‌ గుండెపోటుతో మృతి చెందాడు. అనారోగ్యంతో మూడు రోజుల నుంచి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విష్ణు.. గత అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్లు సమాచారం. 

పుత్రశోకంతో కుంగిపోయిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆస్పత్రికి వెళ్లి తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు  పరామర్శించారు. మహిపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు ఓదార్చారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడి మృతితో స్థానికంగా కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement