Hyderabad: New Twist In Mother And Daughter Suicide - Sakshi
Sakshi News home page

HYD: తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. చేతిపై ఏం రాసి ఉంది?

Jun 23 2023 5:43 PM | Updated on Jun 23 2023 6:39 PM

New Twist In Mother And Daughter Suicide In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తల్లీకూతుళ్ల ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కూతురు లాస్యకి ఉరి వేసి చంపి, తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కొడుకును కూడా చంపే ప్రయత్నం చేసిన తల్లి.. గాడ నిద్రలో ఉండటంతో వదిలేసింది. గత కొంత కాలం నుంచి  తీవ్ర మానసిక వేదనలో ఉన్న తల్లి, కూతురు కరోనా సమయం నుంచి బయటికి రావడం లేదు. రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు అలివేలు.. భర్తనుదూరంగా పంపించింది.

భర్త సదానందానికి రూ.5 వేలు ఇచ్చి యాదాద్రి వెళ్లమని బలవంతంగా పంపించింది. కూతురు చేతిపై ‘Do Something That Make You Happy’ అని రాసింది. ‘The Game Is Started’ అని గోరింటాకుతో రాసుకున్న తల్లీకూతుళ్లు.. ఆత్మహత్యకి ముందు.. ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు. ఇదే విషయంపై కొడుకుతో వాగ్వివాదం  జరిగింది. ఉద్యోగం మానేసిన భర్త సదానందం.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు.
చదవండి: ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య

లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగ్గా లేదని, కరోనా టైం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారన్నారని రాయదుర్గం సీఐ మహేష్‌ తెలిపారు. రెండేళ్లగా ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఇంటి పక్కన వాళ్లతో కూడా మాట్లాడటం లేదు.. ఆత్మహత్యకి ముందు.. తల్లీ కూతుళ్ళు ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు.. ఎందుకు అని బాబు అడిగితే.. చిన్న పిల్లాడివి.. నీకేం తెలియదు అంటూ తల్లి మందలించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’’ అని సీఐ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement