కరీంనగర్‌లో విషాదం | Mother And Son Were Deceased Due To Accidentally Fell Into Maneru Vagu | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో విషాదం

Oct 18 2020 8:47 PM | Updated on Oct 18 2020 8:49 PM

Mother And Son Were Deceased Due To Accidentally Fell Into Maneru Vagu - Sakshi

మానేరు వాగు

విహారయాత్ర దైవదర్శనం విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

సాక్షి, కరీంనగర్‌ : మానేరు వాగులో ప్రమాదవశాత్తు పడి తల్లి కొడుకు మృతి చెందారు. మృతులు కాశ్మీర్ గడ్డకు చెందిన మహిళ సకీనా ఆమె మూడేళ్ళ కుమారుడు అహిల్ గా గుర్తించారు. కుటుంబంతో కలిసి సదాశివపల్లి వద్ద గల దర్గాకు వెళ్లి తీగల వంతెనవద్ద మానేరు వాగు లోకి దిగారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో తల్లి కొడుకు గల్లంతయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్‌ఎండీ గేట్లు మూసివేశారు.
(చదవండి : హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య )

కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అప్రమత్తమై గాలించగా అప్పటికే తల్లి మృతి చెందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకును పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. కళ్ళ ముందే ఇద్దరు వాగులోపడి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విహారయాత్ర దైవదర్శనం విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement