మైనర్‌ పై సాముహిక అత్యాచారం... ఫిర్యాదు చేసిందనే కోపంతో తోటి విద్యార్థులే...

Minor Girl Allegedly Gang Molestation By Five Students At Bihar - Sakshi

పాట్నా: రాను రాను ‍మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల జరగడం అనేది సర్వసాధారణంగా అయిపోతుందేమో. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా పరిస్థితి నానాటకీ దిగజారిపోతుందే గానీ చక్కబడుతుందనే ఆశ కానరావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు గురించే వింటున్నాం. చదువుకున్నవాళ్లు సైతం కామంధులై అత్యంత దారుణాలకి ఒడిగడుతున్నారు. అచ్చం అలానే బీహార్‌లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...బీహార్‌లోని జాముయ్‌లో ఒక మైనర్ కోచింగ్‌ సెంటర్‌ నుంచి తిరిగి వస్తుండగా ఆమె పై ఐదుగురు విద్యార్థులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఐదుగురు అదే కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థులు. ఐతే ఆ బాలిక గతంలో తనతో ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడంటూ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఆమె పై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మైనర్‌ తల్లిదండ్రులు కోచింగ్‌ నిర్వాహకులు ఇకపై మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇ‍వ్వడంతోనే కోచింగ్‌ సెంటర్‌ పంపామని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: అత్యాచారం చేశారని ఫిర్యాదు కోసం వస్తే.. స్టేషన్‌లో పోలీసులు..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top