‘డాడీ, మమ్మీ గొడవ పడ్డారు.. ఆ అంకుల్‌ డాడీని కొట్టాడు’

MAN Suspicious Deceased In Chittoor District - Sakshi

పాకాల(చిత్తూరు జిల్లా): ఓ వివాహితుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన సోమవారం అర్ధరాత్రి స్థానిక శివశక్తి నగర్‌లో చోటు చేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు..చెన్నుగారిపల్లె దళిత వాడకు చెందిన నవీన్‌కుమార్‌(28) తన భార్య ఐషు, కుమారుడు హర్షిత్‌ కలిసి శివశక్తి నగర్‌లో కాపురం ఉంటున్నాడు. సోమవారం రాత్రి బెడ్రూమ్‌లోకి వెళ్లి తలుపు గడి పెట్టుకున్నాడు. భార్య ఎంతసేపు పిలిచినా, తలుపు తట్టినా నవీన్‌ బదులివ్వకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. తన మామయ్య, బావకు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడితో గొడవ.. ఇంతలోనే..

బెడ్‌రూం తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న నవీన్‌ను చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీసులకు తెలియజేయడంతో ఎస్‌ఐ వంశీధర్‌ తన సిబ్బందితో చేరుకుని పరిశీలించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కుమారుడు బలవన్మరణం చెంది ఉంటాడని అనుమానిస్తూ మంగవారం ఉదయం మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు. 

‘‘మా డాడీ, మమ్మీ గొడవ పడ్డారు.. కొంతసేపటికి మా ఇంటి దగ్గరలోని ఇంటి నుంచి ఒక అంకుల్‌ వచ్చి  మా డాడీని కొట్టాడు.. ఆ తర్వాతే మా డాడీ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి గడి పెట్టుకుని తలుపే తీయలేదు..’’ అని హర్షిత్‌ (7)మంగళవారం సాయంత్రం తన అవ్వాతాతలతో పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి చెప్పడంతో ఎస్‌ఐ ఆశ్చర్యచకితులయ్యా రు. కంప్లైంట్‌ కూడా మార్చమని ఎస్‌ఐ సార్‌కు చెప్పు తాతా..అని పదే పదే చెప్పాడు. నవీన్‌ మృతికి కారణాలేమిటో  పోస్టుమా ర్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు లో  తెలియాల్సి ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top