కామాంధుడు.. తినుబండారాలు కొనిపెడతానని ఇంటికి తీసుకెళ్లి.. | Man Molested Girl In East Godavari | Sakshi
Sakshi News home page

కామాంధుడు.. తినుబండారాలు కొనిపెడతానని ఇంటికి తీసుకెళ్లి..

Mar 21 2022 11:52 AM | Updated on Mar 21 2022 11:54 AM

Man Molested Girl In East Godavari - Sakshi

ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిని కామాంధుడు కాటేశాడు. ద్రాక్షారామ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రామచంద్రపురం రూరల్‌(తూర్పుగోదావరి): ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిని కామాంధుడు కాటేశాడు. ద్రాక్షారామ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు సత్యవాడ సత్యనారాయణ ఆదివారం కందులపాలెం గ్రామం నుంచి రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాలికను తినుబండారాలు కొనిపెడతానని బండి ఎక్కించుకుని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ బాలిక నోట్లో దుప్పటి కుక్కి ఆమెపై అత్యాచారం చేశాడు. రక్తం కారుతున్న బాలికను కందులపాలెంలో రోడ్డుపై వదిలి పెట్టి వెళ్లిపోయాడు.

చదవండి: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

స్థానికులు బాలికను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం సీఐ వి.శ్రీనివాస్‌ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక స్వయంగా ఆయనతో జరిగిన ఘటన చెప్పడంతో పాటు ఎవరికైనా చెబితే చంపి కాలువలో పడేస్తానని బెదిరించినట్టు చెప్పడంతో సీఐ అవాక్కయ్యారు. డీఎస్పీ బాలచంద్రారెడ్డి వచ్చి బాలిక పరిస్థితిని పరిశీలించారు. బాలికను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ద్రాక్షారామ ఎస్సై ఎస్‌.తులసీరామ్‌ బాలిక బంధువుల నుంచి వివరాలు సేకరించారు. బాలిక తల్లితో మాట్లాడి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement