పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందని..అవమానంతో యువకుడు మృతి

Man Died By Suicide After His Fiancees Family Called Off At Bengaluru - Sakshi

ఒక వ్యక్తి పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందని అవమానంతో ఆత్యహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితుడు తండ్రి పోలీసులు ఫిర్యాదు చేయడంతో.. సదరు మహిళ కుటుంబసభ్యలు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మృతుడుని 29 ఏళ్ల మోహన్‌ కుమార్‌గా గుర్తించారు పోలీసులు. అతనికి కావ్య శ్రీ అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది.

పెళ్లి తర్వాత కూడా చదువకోవచ్చని ఆమెకు అబ్బాయి కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే బాధితుడు మోహన్‌ వివాహ ఏర్పాట్ల కోసం సుమారు రూ. 10 లక్షలు కాబోయే భార్య కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. ఐతే మోహన్‌ గురించి అమ్మాయి కుటుంబ సభ్యులు కొన్ని రూమర్లు విని పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మోహన్‌, అతడి కుటుంసభ్యులను అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించి....వివాహం రద్దు చేసుకోవాలని సూచించారు.

అలాగే డబ్బులు వెనుకకు ఇచ్చేందుకు నిరాకరించడమే గాక పెళ్లిని రద్దు చేసుకోమని ఒత్తిడి చేశారు. అలాగే అమ్మాయిని ఇక ఇబ్బంది పెట్టకూడదని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తిందని, అలాగే తమను బయటకు గెట్టివేసి అవమానించినట్లు మోహన్‌ తండ్రి రంగస్వామి ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ అవమానం తోపాటు పెళ్లి కూడా రద్దు కావడంతో తన కొడుకు మోహన్‌ కలత చెంది ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలిపాడు. మోహన్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజులానే ఆరోజు కూడా డ్యూటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన కాబోయే భార్య ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటనతో నిందితులు పరారీలో ఉన్నారు. ఈమేరకు పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: రెండు కార్లు ఢీ...మృత్యువులోనూ వీడని బంధం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top